మీ కొడుకుని నా దగ్గరకు పంపండి.. మీ కోడలికే మంచిది.. రాఖీ సావంత్ అసభ్యకర వ్యాఖ్యలు!
on Mar 7, 2024
వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇటీవల రాధికా మర్చంట్ తో జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఎందరో సినీ స్టార్స్ సందడి చేశారు. బాలీవుడ్ ఖాన్ త్రయం సహా ఎందరో స్టార్స్ డ్యాన్స్ లు వేసి అలరించారు. అయితే కొందరు సినీ స్టార్స్ మాత్రం.. ఇలా డబ్బుల కోసం సెలబ్రిటీల పెళ్లిళ్లలో డాన్సులు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఎంత డబ్బిచ్చినా ఇలా సెలబ్రిటీల పెళ్లిళ్లలో డాన్సులు చేయనని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. ఇక మరో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అయితే హద్దుమీరి వ్యాఖ్యలు చేసింది. సినీ సెలబ్రిటీల డ్యాన్స్ ల గురించి, అనంత్ అంబానీ బరువు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
అనంత్ అంబానీ పెళ్లి వేడుక గురించి తాజాగా రాఖీ సావంత్ స్పందించింది. "అంబానీ జీ.. మీరు నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు. మీరు నా డ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు అనుకుంటా. మీ వేడుకలో డ్యాన్స్ చేసిన వారంతా.. నా ముందు జుజుబీ. మీరు కోట్లకు కోట్లు డబ్బులిచ్చినా సింగర్ రిహానా వంటి వారు చిరిగిన బట్టలతో వచ్చారు. అదే మీరు నాకు పది కోట్లు ఇచ్చినట్లయితే.. గెస్ట్ ల రూమ్స్ క్లీనింగ్ మొదలుకొని, వంట పాత్రలు కడిగేవరకు అన్ని పనులు చేసేదాన్ని." అంటూ రాఖీ సావంత్ హాట్ కామెంట్స్ చేసింది.
ఇక అనంత్ అంబానీ బరువుపై ఆమె చేసిన వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి. " అంబానీ జీ.. మీ కుమారుడు అనంత్ బాగా బరువు పెరిగారు. ఆయన్ను ఐదు రోజులు నా దగ్గరకు పంపండి. బాగా సన్నగా చేసి పంపుతాను. దీని కోసం కొంత డబ్బు ఇచ్చి నన్ను కొనుక్కోండి. ఆయనతో వర్కౌట్స్ చేయించడంతో పాటు.. తృప్తి పరిచి పంపుతాను. అనంత్ ను జీరో సైజుకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆయన బరువు తగ్గితే మీతో పాటు.. మీ కోడలు కూడా సంతోషిస్తుంది. అసలే మీ కోడలు దానిమ్మ పండులా ఉంది. మీ కొడుకు సన్నబడితే ఆమెకే మంచింది" అంటూ హద్దుమీరి అసభ్యకర వ్యాఖ్యలు చేసింది రాఖీ సావంత్.
అయితే అనంత్ అంబానీ బరువు గురించి రాఖీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అనారోగ్యంతో బరువు పెరిగిన వ్యక్తిపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. అలాగే రాధికా మర్చంట్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read